అదృష్టం, సంపద పెరగాలని కోరుకుంటూ కొంతమంది ఇంట్లో మొక్కలు పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మార్చే మొక్కలు అనగానే మనీ ప్లాంట్, క్రాసుల, లక్కీ వెదురు ఎక్కువగా పెంచుకుంటారు. ఇవే మాత్రమే కాదు నెమలి మొక్క కూడా మీ ఇంట్లో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాల తొలగించడంలో ప్రభావంతంగా పనిచేస్తోంది. మీ ఇంట్లో ఈ నెమలి మొక్కని నాటడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.