Home ఆంధ్రప్రదేశ్ Election Code : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్…. ఇకపై తిరుమలలో ఆ లేఖలను స్వీకరించరు

Election Code : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్…. ఇకపై తిరుమలలో ఆ లేఖలను స్వీకరించరు

0

ఎన్నికల షెడ్యూల్ (AP Election Schedule)ప్రకటన రాక ముందు నుంచే రాష్ట్రంలోకి వచ్చే రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇప్పటి వరకూ 164 కోట్ల విలువైన నగదు, వస్తువులు, డ్రగ్స్, మద్యం సీజ్ చేశామన్నారు. ఉచితాలు, నగదు తరలింపు కోసం అన్ని కేంద్ర ,రాష్ట్ర ఏజెన్సీలతో నిఘా పెట్టామని తెలిపారు. హెలికాప్టర్లు, విమానాల ద్వారా తరలించేందుకు అవకాశం లేకుండా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈసారి ఎన్నికలకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసారి బందోబస్తు కోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల పారామిలటరీ బలగాలు, 465 కంపెనీల సాయుధ బలగాలు అవసరం అవుతున్నారని చెప్పారు. ఏపీకి 2 లక్షల ఈవీఎం(EVMs) యంత్రాలను ఈసీఐ కేటాయించిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

Exit mobile version