తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటినుండి ( మార్చి18) 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.సరైన ప్రణాళికలు రూపొందించుకొని, విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని, పరీక్షల సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి ముందే పరీక్షా హాళ్లకు చేరుకునే విధంగా పక్క ప్రణాళిక చేసుకోవాలని తుంగతుర్తి రవి విద్యార్థులకు సూచించారు.