Friday, January 24, 2025

మెదక్ జిల్లాలో దారుణం, చున్నీతో తండ్రికి ఉరేసి హత్య చేసిన కొడుకు-medak crime news son killed father due to family disputes ,తెలంగాణ న్యూస్

వాటర్ హీటర్ తో తండ్రిని కొట్టి, చున్నీతో ఉరేసి

అనంతరం సుగుణమ్మ పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ప్రేమానందం, తన తండ్రి ప్రసాద్ ఇంటివద్ద ఉన్నారు. తరచూ గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన పెద్దకొడుకు సందీప్ తండ్రిని ఎలాగైనా హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలో శనివారం రామతీర్థానికి వచ్చాడు. ఇంట్లో ఉన్న తాతను బయటకు పంపించి తలుపులు మూసి గడియపెట్టాడు. అనంతరం వాటర్ హీటర్ తో తండ్రిని కొట్టి, చున్నీతో ఉరేసి చంపాడు. సందీప్ సిద్ధిపేటలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి (Medak Govt Hospital)తరలించారు. ప్రేమానందం తండ్రి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana