Saturday, January 18, 2025

మేలో ఏపీ ఎన్నికలు.. తెలుగుదేశం విజయం పక్కా! | ap elections in may| history| sentiment| tdp| win

posted on Mar 17, 2024 11:16AM

కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా శనివారం (మార్చి 16) షెడ్యూల్ విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికలు మే 13న జరుగుతాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన క్షణం నుంచీ తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం విజయం తధ్యమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. చరిత్ర కూడా ఇదే చెబుతోందని ఉదాహరణలు చూపిస్తున్నాయి. సెంటిమెంట్ కూడా మేలో ఎన్నికలు అంటే తెలుగుదేశం విజయం అనే చెబుతోందని గుర్తు చేస్తున్నాయి. ఇంతకీ తెలుగుదేశం విజయానికీ, మేలో ఎన్నికలకు సంబంధం ఏమిటి?  ఆ సెంటిమెంట్ ఏమిటి? ఆ చరిత్ర ఏమిటి? అంటే.. మేలో ఎన్నికలు జరిగిన ప్రతి సారీ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందిజ 2004లో ఆంధ్రప్రదేశ్ లో  ఏప్రిల్ 20, 26 తేదీలలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది.

అలాగే 2009లో ఏపీ ఎన్నికలు ఏప్రిల్ 16, 20 తేదీలలో రెండు దశల్లో జరిగాయి. ఆ ఎన్నికలలోనూ కాంగ్రెస్ చేతిలో తెలుగుదేశం పరాజయం పాలైంది. ఇక 2014లో ఏపీలో ఎన్నికలు ఒకే దశలో మే 7న జరిగాయి. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. వైసీపీ పరాజయం పాలైంది.

ఆ తరువాత 2019లో ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఓకే విడతలో మే 13న జరగనున్నాయి. దీంతో  ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం సాధించడం ఖాయమని తెలుగుదేశం శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. సెంటిమెంట్ ప్రకారం చూసినా,

2004 నుంచి జరిగిన ఎన్నికల చరిత్ర చూసినా మేలో ఎన్నికలు జరగడం తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందని తేటతెల్లమౌతోందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. దీంతో2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana