Home తెలంగాణ కవితే కీలక సూత్రదారి…! ఈడీ కస్టడీ పిటిషన్ లో కీలక విషయాలు-key points of ed...

కవితే కీలక సూత్రదారి…! ఈడీ కస్టడీ పిటిషన్ లో కీలక విషయాలు-key points of ed brs mlc kalvakuntla kavitha custody petition in delhi liquor scam ,తెలంగాణ న్యూస్

0

కీలక విషయాలు…

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇతర వ్యక్తులతో కలిసి రూ 100 కోట్ల అవినీతికి కుట్ర పన్నినట్లు ఈడీ తన కస్టడీ పిటిషన్ లో ప్రస్తావించింది. కిక్‌బ్యాక్‌ చెల్లింపులో ఆమె క్రీయాశీలకంగా పాల్గొందని….. ఆపై మనీలాండరింగ్‌కు అనుకూల పరిస్థితులను కల్పించిందని తెలిపింది. ఇండో స్పిరిట్స్‌ని తన గుప్పిట్లో పెట్టుకుని తద్వారా రూ 192.8 కోట్ల అక్రమంగా డబ్బు ఆర్జించిందని అభియోగం మోపింది. “2021-22 ఎక్సైజ్‌ పాలసీ అమలులో చట్టవిరుద్ధంగా ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అక్రమంగా చెల్లింపు చర్యలలో పాల్గొంటుంది. ఆమె బినామీ అయిన అరుణ్‌ పిళ్లై ద్వారా ఇండో స్పిరిట్స్‌లో భాగస్వామిగా ఉన్నారు. చెల్లించిన పెట్టుబడిని తిరిగి అక్రమంగా ఆదాయాన్ని సంపాదించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి కవిత రూ100 కోట్ల పివోసి బదిలీలో ఆమె సిబ్బంది, సహచరులు అభిషేక్‌ బోయిన్‌పల్లి, బుచ్చి బాబు ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులకు చెల్లించింది” అని ఈడీ వివరించింది.

Exit mobile version