Home తెలంగాణ ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన ఐనాల శివాని

ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన ఐనాల శివాని

0
  • ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన ఐనాల శివాని
  • ఐనాల శివాని ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో తన సత్తా చాటింది. 
  • WPC భారత అధ్యక్షుడు దల్జీత్ సింగ్ మరియు WPC రాష్ట్ర అధ్యక్షురాలు ఇంటూరి రేఖకు శివాని కృతజ్ఞతలు తెలిపారు.
  • ట్రైనర్ ప్రదీప్ కుమార్ సహకారం ఎనలేనిది: శివాని
  • పట్టుదల ఉంటే అసాధ్యం ఏదీ లేదు : ప్రదీప్ కుమార్

నేటి ఆధునిక రంగంలో పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఓ యువతి నిరూపించింది. లక్ష్యసాధనకు కృషి చేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని ఈ యువతి మరోసారి కళ్లకు కట్టింది. తెలంగాణ వాసి ఐనాల శివాని శనివారం కిర్గిస్థాన్‌లో జరిగిన ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి మూడు బంగారు పతకాలు గెలుచుకుంది.పవర్‌లిఫ్టింగ్‌లో భాగం అయిన స్కౌట్స్ లో 100 కిలోలు, బెంచ్ ప్రెస్ 57.5 కిలోలు, డెడ్ లిఫ్ట్ 142.5 కిలోలతో రికార్డు సృష్టించి విజేతగా నిలిచింది. మూడు బంగారు పతకాలు సాధించి భారతదేశం మరియు తెలంగాణ పేరును ప్రపంచ స్థాయిలో ముందు నిలబెట్టింది. ఈ సందర్భంగా ఐనాల శివాని మాట్లాడుతూ సహజంగానే ఆడపిల్లలను వెయిట్ లిఫ్టింగ్ చేయనివ్వరు. అది కేవలం అబ్బాయిల వల్ల మాత్రమే అయ్యే పనిగానే చూస్తారు. చిన్నతనం నుండే శిక్షణ పొందినా లేదా మెళకువలు తెలిసినా బాలికలకు కూడా బరువులు ఎత్తడం తేలిక అన్నారు. ప్రొఫెషనల్‌గా మారడానికి, శారీరక బరువు మరియు మానసిక సమతుల్యతను సాధించడానికి, బరువు నిర్వహణ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. శక్తిలో కూడా మార్పులు వస్తాయి. అబ్బాయిలతో పోలిస్తే మహిళా వెయిట్ లిఫ్టర్ల ఆహారం భిన్నంగా ఉంటుంది. బరువులు ఎత్తేటప్పుడు కండరాలు బిగుసుకుపోతాయి. బరువులు ఎత్తేటప్పుడు శ్వాస తీసుకోవడంలో తేడాలు ఉంటాయి. కానీ, సాధనతో వీటన్నింటిని అధిగమించాలని, మంచి ఆహారం, సరైన నిద్ర, స్ట్రెస్ లెవెల్స్ తో వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నించడం వల్లనే ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించగలిగానని చెప్పింది. ట్రైనర్ ప్రదీప్ కుమార్ సహకారం ఎనలేనిది: శివాని

ప్రపంచ స్థాయిలో బంగారు పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ప్రదీప్ కుమార్ మార్గదర్శకత్వం మరియు శిక్షణ వల్లే ప్రపంచ స్థాయికి వెళ్లగలిగాను అని శివాని అన్నారు. ఈ సందర్భంగా శివాని మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న భారత డబ్ల్యూపీసీ అధ్యక్షుడు శ్రీ దల్జీత్ సింగ్ కి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఇంటూరి రేఖ కు కృతజ్ఞతలు తెలిపారు. పట్టుదల ఉంటే అసాధ్యం ఏదీ లేదు : ప్రదీప్ కుమార్, ఏఏఓ రాచకొండ

కృషి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు, గమ్యాన్ని చేరుకోవడానికి నిత్యం సాధన చేయాలి. ఈ ప్రక్రియలో చాలా అడ్డంకులు ఉన్నాయి. అవన్నీ దాటితే గమ్యాన్ని చేరుకోవచ్చు. అయినాల శివాని నిబద్ధత కలిగిన యువతి, క్రమ శిక్షణతో రోజూ సాధన చేసేది. ప్రపంచ స్థాయిలో బంగారు పతకాలు సాధించి తెలంగాణకు, భారతదేశానికి పేరు తీసుకురావడం ఆనందంగా ఉంది. తెలంగాణకు చెందిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు భారతదేశానికి చెందిన దల్జీత్ సింగ్ మరియు ఇంటూరి రేఖకు నేను కృతజ్ఞతలు తెలిపాను. క్రీడల్లో ప్రతిభ కనబర్చాలనుకునే క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని ప్రదీప్ కుమార్ తెలిపారు.

Exit mobile version