Tuesday, January 7, 2025

Shreya Ghoshal : శ్రేయ ఘోషల్ ఒక్క పాట రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఇండియాలోనే రిచ్ సింగర్

మన ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అద్భుతమైనటువంటి ప్లే బ్యాక్ సింగర్లు( Playback Singers ) ఉన్నారు ఇలా వివిధ భాషలలో ఎంతో అద్భుతమైన గాత్రం కలిగి ఉండి ఫేమస్ అయినటువంటి సింగర్లు ఎంతోమంది ఉన్నారు.ఇలా ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ శ్రేయ ఘోషల్( Shreya Ghoshal ) ఒకరు.

 Do You Know Shreya Ghoshal Remuneration For One Song-TeluguStop.com

ఈమె బాలీవుడ్ ప్లే బాక్స్ సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.అయితే దాదాపు 15 భాషలలో ఈమె వేల సంఖ్యలో పాటలు పాడుతూ శ్రోతలను ఆకట్టుకున్నారు.

శ్రేయ ఘోషల్ గాత్రం నుంచి పాట వస్తోంది అంటే అది చెవులకు ఎంతో వినసొంపుగా ఉంటుంది.ఈమె ఎలాంటి పాటలు పాడిన శ్రోతలను ఆ పాటలు ఇట్టే ఆకట్టుకుంటాయి.ఇక ఈమె ఒక సినిమాలో ఒక పాటతో సరిపెట్టుకోదు దాదాపు రెండు మూడు పాటలు పాడుతారు.ఈమె పాటలు పాడారు అంటే ఆ సినిమా ఆడియో రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోతాయి.

అంతలా ఈమె ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారని చెప్పాలి.

ఇలా ఇండియాలో ఇంత ఫేమస్ అయినటువంటి శ్రేయ ఘోషల్ రెమ్యూనరేషన్( Shreya Ghoshal Remuneration ) కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.మన ఇండియాలో ఒక పాట పాడితే పెద్దగా రెమ్యూనరేషన్ ఇవ్వరని ఎంతోమంది సింగర్లు ఇదివరకే పలు సందర్భాలలో తెలియజేశారు.అయితే శ్రేయ ఘోషల్ మాత్రం ఒక పాట పాడటం కోసం ఏకంగా 25 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తుంది.

ఇలా ఒక పాటకు 25 లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.ఇక ఈమె సింగర్ గా మాత్రమే కాకుండా ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరించడమే కాకుండా శ్రేయా ఘోషల్ టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో 5 సార్లు స్థానం సంపాదించుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana