సినిమా హీరోలను ప్రజలకు నమ్మరు
ఏపీ ప్రజలు సినిమా హీరోలను నమ్మరని ముద్రగడ అన్నారు. తాను కాపులు, దళితుల కోసం పోరాటం చేశానన్నారు. జగన్(CM Jagan) దగ్గరకు ఎందుకు వెళ్లావు, మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్లలేదని కొందరు పోస్టులు పెడుతున్నారన్నారు. సినిమాలో ఆయన గొప్ప కావొచ్చు తాను రాజకీయాల్లో గొప్ప అన్నారు. ఆ మాటకొస్తే రాజకీయాల్లోనూ, సినిమా రంగంలోనూ నేను ముందున్నానన్నారు. వైసీపీ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినన్నారు. కానీ కొందరు నన్ను సీఎం జగన్‌కు దూరం చేశారని ఆరోపించారు. మళ్లీ ఇన్నాళ్లకు వైసీపీలో చేరడం హ్యాపీగా ఉందన్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ముద్రగడ ప్రకటించారు.