2024 Lok Sabha Election schedule live updates : యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న ఘట్టానికి సమయం ఆసన్నమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కూడా వెల్లడించనుంది.
Sat, 16 Mar 202407:17 AM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మెజారిటీ ఫిగర్ 88ని దాటాలి. జగన్ నేతృత్వంలోని వైసీపీ.. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉంది
Sat, 16 Mar 202407:00 AM IST
లోక్‌సభ సీట్లు..
లోక్‌సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. వీటిల్లో 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ నుంచి మే మధ్య వరకు పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. సాధారణంగా మే చివరి వారంలో ఫలితాలు వెలువడతాయి.
Sat, 16 Mar 202406:55 AM IST
మోదీ వర్సెస్ ఇండియా కూటమి..
2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి.. హ్యాట్రిక్ సాధించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ భావిస్తోంది. మోదీని ఢీకొట్టి, ఆయన్ని గద్దెదించేందుకు.. విపక్ష ఇండియా కూటమి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ దఫా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి, అంచనాలు పెరిగిపోయాయి.
Sat, 16 Mar 202406:49 AM IST
3 గంటలకు ప్రెస్ మీట్..
ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీటింగ్‌ని నిర్వహిస్తుంది ఈసీ.
Sat, 16 Mar 202406:49 AM IST
4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కూడా..
లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు.. ఆయా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించనుంది ఎన్నికల సంఘం
Sat, 16 Mar 202406:46 AM IST
మధ్యాహ్నం 3 గంటలకు..
యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న ఘట్టానికి సమయం ఆసన్నమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలపై ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి కీలక అప్డేట్ వచ్చింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.