కంట్రోల్ రూమ్ ద్వారా ఏపీపీఎస్సీ అధికారుల పర్యవేక్షణ
అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అంతేగాక ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు (AP Group 1 Prelims)జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే జిల్లాల్లో కూడా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. పరీక్ష అనంతరం ఆన్సర్ సీట్లు ఇతర సామాగ్రి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని, ఇలా ఎవరైనా తీసుకొచ్చి పరీక్ష కేంద్రంలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఏపీపీఎస్సీ హెచ్చిరించింది.