ఈ కుల్ఫీలో మనం ఉపయోగించినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. పాలు, బాదం, పిస్తా, కండెన్స్‌డ్ మిల్క్, ఫ్రెష్ క్రీము, యాలకుల పొడి, కుంకుమపువ్వు… ఇవన్నీ కూడా మనకు ఏదో రకంగా ఆరోగ్యానికి మేలు చేస్తారు. మిల్క్ బ్రెడ్ లో కూడా పాలే ఉంటాయి. కాబట్టి రుచిగా ఉంటాయి. ఇందులో మనం పంచదారను కలపలేదు. పంచదార కలిపితే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కానీ మిల్క్ బ్రెడ్‌లో ఉన్న తీయదనమే ఈ కుల్ఫీకి సరిపోతుంది. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ఇంట్లో చేసి పెట్టండి… పిల్లలు పెద్దలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు.