Thursday, January 9, 2025

మే 13న ఎపిలో పోలింగ్ … జూన్ 4న  కౌంటింగ్ 

posted on Mar 16, 2024 4:36PM

 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది.

మే 13న నాలుగో దశ పోలింగ్ ఉంది. ఎపిలో లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. 

ఏపీలో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో ఒకే విడతలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో అసెంబ్లీ సమరం మొదలైంది. పోలింగ్, కౌంటింగ్ తేదీలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ తేదీలు ఖరారయ్యాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల 16 న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. 18 వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మే 13 న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

2019 ఎన్నికల సమయంలో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ సారి ఆరు రోజులు ఆలస్యంగా షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా, 2019 మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా, ఆ ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ ప్రభుత్వం విజయం సాధించింది. మే 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఇక, ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారింది. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్, వామపక్షాలు మరో కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తోంది. ఈ రోజు వైసీపీ తమ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దుల జాబితా ప్రకటన చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana