పవర్ ముద్ర ఎలా వేయాలి?
ప్రతిరోజూ ఈ శక్తి ముద్రను వేయడం మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఇది శక్తివంతమైన అభ్యాసం. మీ వెన్నుముకను నిటారుగా ఉంచి, మీ భుజాలను రిలాక్స్ మోడ్ లో ఉంచండి. నేలపై కూర్చుని పద్మాసనం తెలుసుకోండి. లేదా కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చొని కూడా ఈ శక్తి ముద్ర వేయొచ్చు. మీ చేతులను, మోకాళ్లపై పెట్టి ఫోటోలో చూపించిన విధంగా ముద్రను వేయాలి. ఇది వేళ్ళ ద్వారా మీ శరీరంలోకి శక్తిని పంపిస్తుంది. మీరు ఆ శక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందుతారు. ఈ శరీరం అంతా శక్తి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి.