జనవహిని న్యూస్ బషీరాబాద్ మండల ప్రతినిధి మార్చి 16 :- బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామములో శనివారం నాడు బీపీఎం వంశీ మహిళలతో మాట్లాడుతూ ఈ పథకం క్రింద అమ్మాయి లేదా మహిళ కోసం ఖాతా తెరువవచ్చు .కనిష్టంగా వెయ్యి (1000) రూపాయలు గరిష్ఠంగా రెండు లక్షల రూపాయలు వరకు (2,00,000) ఖాతాలో జమ చేయవొచ్చు.ఈ పథకం క్రింద సంవత్సరానికి వడ్డీ రేటు 7.5 శాతం ఉందని అన్నారు.అలాగే 0-10 సంవత్సరాల లోపు ఆడ పిల్లల పేరున ఈ అకౌంట్ ను 250/- లతో డిపాజిట్ ప్రారంభించవచ్చు అకౌంట్ ప్రారంభించిన నాటి నుండి 21 సంవత్సరాల తరువాత ఈ అకౌంటును క్లోజ్ చేయవచ్చు ప్రస్తుత వడ్డీ రేటు 8.2% ఖాతా తెరిచే వారు ఆడ పిల్ల పుట్టిన తేది సర్టిఫికేట్ తల్లి/తండ్రి ఆధార్ కార్డ్ 2పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని కోరారు.