Friday, January 10, 2025

బిఆర్ఎస్ కు మరో షాక్ … కెటీఆర్ పై కేసు నమోదు 

posted on Mar 16, 2024 11:46AM

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు… ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. నిన్న రాత్రి ఒకసారి, ఈ ఉదయం మరోసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీలోని రౌస్ అరెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టారు. కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత వెంట కెటీఆర్ , హరీష్ రావు ఉన్నారు. కుటుంబసభ్యులంతా నిన్నటి నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ్ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై పోలీస్ కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కాం కేసులో కవితను అరెస్ట్ చేసేందుకు తాము ఆమె నివాసానికి వెళ్లిన సమయంలో కేటీఆర్ దౌర్జన్యం చేశారని ఈడీ అధికారులు కంప్లైట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు ఈడీ అధికారులు. మరోవైపు కవిత అరెస్ట్ చేసిన సమయంలో ఈడీ అధికారిణి భానుప్రియ మీనా తో పాటు మరికొందరు అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ విధులకు అడ్డుతగిలారనే ఈడీ అధికారులు కేటీఆర్ పై కేసు పెట్టమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. బీజేపీనే కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించిందని బీఆర్ఎస్ శ్రేణుల నిరసనల నేపధ్యంలో హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు. మరోవైపు కవిత అరెస్ట్ ని నిరసిస్తూ బీఆర్ఎస్ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana