Home అంతర్జాతీయం Russian presidential elections: కేరళలో రష్యా అధ్యక్ష ఎన్నికలు; ఇక్కడి నుంచే ఓటేస్తున్నారు..

Russian presidential elections: కేరళలో రష్యా అధ్యక్ష ఎన్నికలు; ఇక్కడి నుంచే ఓటేస్తున్నారు..

0

మార్చి 15 నుంచి 17 వరకు

మార్చి 15 నుంచి 17 వరకు రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని 11 టైమ్ జోన్లలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు రష్యా పౌరులు ఓటు వేయనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఎదుర్కొనేందుకు ముగ్గురు అభ్యర్థులకు మాత్రమే రష్యా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆమోదం తెలిపింది. పుతిన్ కు పోటీగా లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్ స్కీ, న్యూ పీపుల్ పార్టీకి చెందిన వ్లాదిస్లావ్ దావంకోవ్, కమ్యూనిస్టు పార్టీకి చెందిన నికోలాయ్ ఖరిటోనోవ్ పోటీ పడుతున్నారు. పుతిన్ తిరిగి ఎన్నికైతే ఆయన పాలన కనీసం 2030 వరకు ఉంటుంది. 2020లో రాజ్యాంగ మార్పుల నేపథ్యంలో మళ్లీ పోటీ చేసి 2036 వరకు అధికారంలో కొనసాగే అవకాశం ఉంది.

Exit mobile version