Tuesday, January 21, 2025

MLC Kavith Arrest Live Updates : కవితను అరెస్ట్ చేసిన ఈడీ

లిక్కర్ కేసు – కవిత అరెస్ట్….?

MLC Kavith Arrest in Delhi liquor scam Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకుంది. ఇవాళ రాత్రికి ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది.

Fri, 15 Mar 202401:11 PM IST

ఈడీ దూకుడు…..

ఈ కేసులో తీర్పును బట్టి ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi excise policy irregularities) కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న మాగుంట రాఘవ, ఆరుణ్ పిళ్లైతో పాటు కవిత పీఏ అశోక్ అఫ్రూవర్లుగా మారటంతో దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. వారు ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసులో దూకుడు పెంచినట్లు సమాచారం.

Fri, 15 Mar 202401:11 PM IST

సుప్రీంలో కవిత పిటిషన్

లిక్కర్ కేసులో తన పేరును ప్రస్తావించటంతో పాటు మహిళలను విచారించే పద్ధతిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసుపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. తుది తీర్పు వచ్చే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు తీర్పునిచ్చింది.

Fri, 15 Mar 202401:10 PM IST

రెండేళ్లుగా విచారణ

ఈ కేసుకు సంబంధించి గత రెండేళ్లుగా కవితపై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సౌత్ గ్రూపునకు సంబంధించి కీలక విషయాల్లో కవిత ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా పలుమార్లు సీబీఐ, ఈడీ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు కవిత. రెండు సార్లు సీబీఐ అధికారులు… హైదరాబాద్ కవిత నివాసంలో విచారణ కూడా జరిపారు. ఇదే క్రమంలో గతేడాది మార్చిలో ఢిల్లీలోని ఈడీ(Enforcement Directorate) ఆఫీస్ లో జరిగిన విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఆ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ కవిత అరెస్ట్ కాలేదు.

Fri, 15 Mar 202401:08 PM IST

కేటీఆర్ ఆగ్రహం

ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Fri, 15 Mar 202401:05 PM IST

ఈడీ అధికారులతో వాగ్వాదం

కవిత తరపున న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవటం పట్ల కేటీఆర్, హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.

Fri, 15 Mar 202401:04 PM IST

రాత్రికి ఢిల్లీకి తరలింపు…?

మరోవైపు కవితను ఢిల్లీకి తరలించేందుకు ఈడీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లైట్ టికెట్లను బుకింగ్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఇవాళ రాత్రి 08.45 నిమిషాలకు విమానంలో ఢిల్లీకి తరలించనున్నట్లు తెలుస్తోంది.

Fri, 15 Mar 202401:04 PM IST

మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

మరోవైపు కవిత తరపు అడ్వొకేట్ సోమ భరత్ ను కూడా లోపలికి అనుమతించలేదు. ఈడీ తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వేళ కేసీఆర్ ను దెబ్బతీసేందుకే ఈ తరహా అరెస్టుకు దిగారని ఆరోపిస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

Fri, 15 Mar 202401:04 PM IST

కవిత నివాసానికి కేటీఆర్, హరీశ్

మరోవైపు కవిత అరెస్ట్ వార్తల నేపథ్యంలో…. సమాచారం అందుకున్న కేటీఆర్, హరీశ్ రావు… వెంటనే కవిత నివాసానికి చేరుకున్నారు. అయితే కవిత ఇంటి గేట్లను మూసివేయించిన అధికారులు… ఎవరిన్ని కూడా లోపలికి అనుమతించలేదు.

Fri, 15 Mar 202401:03 PM IST

ఫోన్లో సీజ్

లిక్కర్ కేసులో సోదాల్లో భాగంగా కవిత ఫోన్లను స్వాధీనం చేసుకుంది ఈడీ. ఇవాళ రాత్రికి ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు కవిత నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Fri, 15 Mar 202401:01 PM IST

ఈడీ అదుపులో కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) నివాసంలో ఈడీ సోదాలు సంచలనంగా మారాయి. లిక్కర్ కేసులో(Delhi liquor Scam) ఈడీతో పాటు ఐటీ అధికారులు ఇవాళ మధ్యాహ్నం తర్వాత తనిఖీలు చేపట్టాయి. తనిఖీల తర్వాత కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana