బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) గేట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని మార్చి 15న విడుదల చేసింది. అభ్యర్థులు గేట్ 2024 (GATE 2024) అధికారిక వెబ్సైట్ gate2024.iisc.ac.in ద్వారా ఫైనల్ ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. గేట్ 2024 పరీక్ష 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో జరిగింది.