Tuesday, October 22, 2024

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసు

What is Delhi liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు ఏంటి…?

  • 2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ(Delhi Liquor)లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
  • మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేస్తూ.. ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చినట్లు నాటి ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నరేశ్ కుమార్ గుర్తించారు.
  • ఈ స్కామ్ కు సంబధించి సమగ్రమైన నివేదిక రూపొందించి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందజేశారు.
  • లెఫ్టినెంట్ గవర్నర్ ఇందులోని వాస్తవాలను బయటికి తీసుకురావాలని కోరుతూ 2021 జూలైలో సీబీఐకి(CBI) లేఖ రాశారు.
  • సీబీఐ కేసును విచారించగా అనేక విషయాలను బయటపెడుతూ వచ్చింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో నిబంధనలక విరుద్ధంగా పలు కంపెనీలకు కట్టబెట్టినట్లు గుర్తించింది.
  • L- 1 కేటాగిరి లైసెన్సులు జారీలో లంచాలు తీసుకోని ఇష్టానుసారంగా అనుమతలు ఇచ్చారనే విషయాలను ప్రస్తావించింది.
  • మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీ పేరు మొదట వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ముఖ్యంగా కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు.

తొలిసారిగా కవిత పేరు…

ఈ కేసులో అమిత్ ఆరోరోనా అరెస్ట్ చేసింది సీబీఐ. అయితే మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని సీబీఐ గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ(ED) కూడా ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్(South Group) చెల్లించినట్లు సీబీఐ తేల్చింది. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ(ED) వెల్లడించింది. 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మెుబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, పది మెుబైల్ ఫోన్ల్(Mobile Phones) వాటినట్టుగా పేర్కొంది. కవిత వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చినట్టుగా ఈడీ తెలుసుకుంది. ఇదే విషయాన్ని అరోరా కూడా అంగీకరించారని తెలిపింది. వైసీపీ ఎంపీ(YSRCP MP) మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని పేర్కొంది. ఇందు కోసం.. ప్రత్యేకంగా ఫోన్స్ ఉపయోగించారని, వాటిని మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో.. అరబిందో శరత్ రెడ్డి(Sarath Reddy)తో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నట్లు గుర్తించిన వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై మరియు అభిషేక్ బోయిన్‌పల్లి మరియు చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబును అదుపులోకి తీసుకుని విచారించింది ఈడీ. వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana