అన్ని వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలు…
జగనన్న చేదోడు ద్వారా రజక, టైలర్లు, నాయి బ్రహ్మణులైన 3,37,802 మందికి రూ.2029.92కోట్లు చెల్లించారు. వైఎస్సార్ లా నేస్తంలో 5781 మందికి రూ.41.52కోట్లు, వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2,76,368మందికి రూ.1,302.34 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆరోగ్యచికిత్సలు పొందిన 15,64,997మందికి రూ.971.28కోట్లు, ఎంఎస్‌ఎంఇ యూనిట్ల పునరుద్దరణలో 23,236మందికి రూ.2,086.42కోట్లు, అగ్రిగోల్డ్ బాధితులైన 10,40,000మందికి రూ.905.57కోట్లు చెల్లించారు.