తులా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపాపరంగా అనుకూల ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఒత్తిడి పెరగడం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. ముఖ్య విషయాలలో సందర్భోచిత నిర్ణయాలు తీసుకోవాలి. గొడవలు వచ్చే అవకాశముంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు చేస్తారు. ఉత్సాహంగా పనిచేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.