ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో గొప్పవారు… మనిషి జీవితాన్ని ఆనందమయం చేయడానికి ఎన్నో మార్గాలను కనిపెట్టారు. ఆహారపరంగా, విహారాల్లో, విజ్ఞానాల్లో మీకు నచ్చిన విధంగా మీ జీవితాన్ని మీరు ఆనందంగా గడపవచ్చు. కొంతమందికి నచ్చిన ఆహారాన్ని తింటే ఆనందం, మరికొందరికి కొత్త ప్రదేశాలకు వెళ్లడం సంతోషం, ఇంకొందరికి కుటుంబంతో గడపడం ఇష్టం… మీకు ఏది ఇష్టమైతే అదే మీ జీవితంలో చేయండి. మీకు ఇష్టం లేని పనిని ఆ క్షణమే వదిలేయండి. అంతే తప్ప జీవితాన్ని తిట్టుకుంటూ కూర్చోకండి.