Home చిత్రాలు కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ రాస్తారోకో

కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ రాస్తారోకో

0

యాదాద్రి భువనగిరి జిల్లా:కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha )ను ఈడీ కేసులో అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ( BRS party ( ఆధ్వర్యంలో సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొణితం యాకూబ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కొండ సోమమల్లు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు సత్యం, ఓయూ జెఏసి( OU JAC ) రాష్ట్ర నాయకులు మర్రి అనిల్ కుమార్,జంగ శ్రీను,మాజీ ఎంపీటీసీ పానుగుల్ల విష్ణు,కూరెళ్ల పరమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

.

Exit mobile version