విద్యుత్ ఛార్జీలు పెంచబోం
కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులను నిరర్థక ఆస్తులుగా వదిలేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గృహజ్యోతిపై (Gruhalakshmi)తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు (Electricity Charges)పెంచబోమని ప్రకటించారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుందన్నారు. మరింత విద్యుత్ వినియోగం పెరిగినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఏప్రిల్, మే నెలల్లో 16 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలో విద్యుత్ పాలసీని తీసుకువస్తామని వెల్లడించారు. వేసవిలో విద్యుత్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. దీంతో పాటు సోలార్ విద్యుత్(Solar Power) వినియోగంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 40,33,702 జీరో బిల్లులు(Zero Bills) ఇచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు.