Home చిత్రాలు Warangal 1000 Pillar Temple : కాకతీయుల శిల్ప సంపదకు జీవం

Warangal 1000 Pillar Temple : కాకతీయుల శిల్ప సంపదకు జీవం

0

(4 / 6)

రెండేళ్ల కిందట ములుగు జిల్లా రామప్ప టెంపుల్(Ramappa Temple ) యునెస్కో గుర్తింపు పొందిన క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి కల్యాణ మండపం పనులపై ఆరా తీశారు. 2022 ఏప్రిల్ 26న కేంద్ర ప్రభుత్వ టూరిజం, ఇతర శాఖల అధికారులతో కలిసి వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు. కల్యాణ మండపం తిరిగి నిర్మించే బాధ్యత తనదేనని మాటిచ్చి, దాని ప్రకారం గతంలో ఖర్చయిన నిధులతో సంబంధం లేకుండా మరో రూ.15 కోట్లు మంజూరు చేశారు. ఆ తరువాత స్థపతి శివకుమార్​ ఆధ్వర్యంలో 70 మంది శిల్పులు పనులు మళ్లీ మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు నిరంతరం శ్రమించి, కల్యాణ మండపానికి రూపం తీసుకువచ్చారు. (Union Minister G Kishan Reddy Twitter)

Exit mobile version