Sunday, December 29, 2024

TDP – Janasena : ప్రభుత్వ హామీతో ఆడబిడ్డలకు రుణాలు, ఉమెన్స్ డే వేళ టీడీపీ సరికొత్త హామీ – వెబ్ సైట్ కూడా ప్రారంభం

“నేడు మళ్లీ మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు హామీ ఇచ్చిందే మహాశక్తి పథకం. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1,500ల ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అందిస్తాం. అలాగే ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా మన ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదు అన్న ఆశయంతో, ‘కలలకు రెక్కలు(TDP Janasena Kalalaku Rekkalu Scheme)’ అనే పథకాన్ని మన ప్రభుత్వం వచ్చాక అమలుచేయబోతున్నాం. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. అంతేకాకుండా కోర్సు కాలానికి ఋణం పై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కలలకు రెక్కలు పథకంలో మీ పేరును ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు. అందుకోసం https://kalalakurekkalu.com వెబ్ సైట్ కు వెళ్ళండి. మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదు… మన ఆడబిడ్డలు బాగుండేలా చూడడం. మీ అందరి మద్దతుతో త్వరలో ఏర్పడే టీడీపీ – జనసేన ప్రభుత్వంలో మీకు అభివృద్ధి, స్వేచ్చ, భద్రత కల్పిస్తాం అని మాట ఇస్తూ….మరోసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అని ట్విట్టర్(X)లో చంద్రబాబు(Chandrababu Tweet) పోస్ట్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana