సుకన్య సమృద్ధి యోజన వివరాలు
ఒక వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిన వెంటనే ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) ఖాతాను ప్రారంభించవచ్చు. ఆ ఖాతాలో సంవత్సరానికి రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒక వ్యక్తి Sukanya Samriddhi Yojana ఖాతాలో 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఏటా రూ. 1.5 లక్షలను డిపాజిట్ చేస్తే, 15 సంవత్సరాలకు అతడు డిపాజిట్ చేసిన మొత్తం రూ. 22,50,000 అవుతుంది. ఈ స్కీమ్ లో మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవత్సరాలు. 15 సంవత్సరాల తరువాత డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి 21 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. 21 సంవత్సరాలు ముగిసిన తరువాత ఆ వ్యక్తికి వడ్డీతో కలుపుకుని రూ. 69,32,638 అందుతాయి. అంటే, తన డిపాజిట్ పై ఆ వ్యక్తికి రూ. 46,82,638 ల వడ్డీ లభిస్తుంది.