మిస్సమ్మ లేకపోవడం వల్లే
తండ్రీకూతుళ్ల ప్లాన్ ఏంటో అర్థంకాక ఆలోచిస్తూ ఉంటుంది మంగళ. మెల్లిగా రామ్మూర్తిని పలకరించి తన పెద్ద కూతురు గురించి ఏమైనా తెలిసిందా అని ఆరా తీస్తుంది. కానీ, రామ్మూర్తి కోపం చూసి ఊరికే అడిగానని చెప్పి తప్పించుకుంటుంది. మనోహరి ఆట కట్టించాలని రాథోడ్, పిల్లలు, భాగమతి కలిసి ఓ ప్లాన్ వేస్తారు. మిస్సమ్మ లేకపోవడం వల్లే తమకి స్కూల్‌కి లేటయిందని అంటారు పిల్లలు. ఇంట్లో మీకు కాబోయే అమ్మ మనోహరి అమ్మగారు ఉండగా ఆ మిస్సమ్మని ఎందుకు కలవరిస్తున్నారు అంటాడు రాథోడ్.