ఆధునిక కాలంలో ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. అలాంటి వ్యాధులకు చెక్ పెట్టాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ఈ నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, సమ్మేళనాలు ఎన్నో ఉంటాయి. ఈ రోగనిరోధక శక్తిని బలంగా మార్చి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. నువ్వుల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి, కాబట్టి సాధారణ నూనెతో పోలిస్తే నువ్వుల నూనెను తక్కువగా వినియోగిస్తే మంచిది. అంటే రెండు స్పూన్ల సాధారణ నూనె వాడే దగ్గర కేవలం ఒక స్పూన్ నువ్వుల నూనె వాడితే సరిపోతుంది. లేదా ప్రతిరోజు నువ్వుల నూనెతో వండే కన్నా… వారానికి నాలుగైదు సార్లు నువ్వుల నూనె వంటలను తింటే అన్ని పోషకాలను అందుతాయి.