Home అంతర్జాతీయం Employees DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు – 4 శాతం డీఏ...

Employees DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు – 4 శాతం డీఏ పెంపు, కేంద్ర కేబినెట్ ఆమోదం

0

కేంద్రం నిర్ణయంతో దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖాజానాపై అదనంగా రూ.12,868.72 కోట్లు భారం పడనుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2024 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. చివరిసారిగా 2023 అక్టోబర్ లో డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) లను కేంద్ర కేబినెట్ 4 శాతం పెంచింది. దాంతో ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్ 2023 జూలై 1 నుంచి 46 శాతానికి పెరిగింది. ఆ సమయంలో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరింది.  జనవరి, జూలై నుండి అమలులోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు DA మరియు DR లను పెంచుతారు. DA, DR లను ఎంత పెంచాలనే విషయాన్నిఆల్ ఇండియా CPI-IW డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

Exit mobile version