టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ), ఆయన కుమారుడు లోకేశ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani )తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు, లోకేశ్ కుర్చీలను ఎప్పుడో మడతపెట్టేశారని పేర్కొన్నారు.2024 లో కుర్చీలు ఎక్కడ మడతపెట్టాలో అక్కడ మడత పెడతారని చెప్పారు.మీరు ఊరూరు తిరిగి కుర్చీలు తెచ్చుకున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదన్నారు.
ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం జగన్( YS jagan ) దేనని తెలిపారు.మీ సభలు చూడండి.
మా సభలు చూడండని వెల్లడించారు.మీ ఖాళీ కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టుకోవాలో చూసుకోండని సూచించారు.గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని తెలిపారు.జగన్( YS jagan ) గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు.