ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. కోనసీమలో బెల్లంపూడి వద్ద కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టి పక్కన కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులోని ఏడుగురు నీటిలో మునుగుతున్నారు. వెంటనే అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే స్పందించారు. తన ప్రాణాలు కూడా లెక్కచేయకుండా కాలువలోకి దూకారు. వెంటనే ఆ కారు డోర్లు తెరిచి లోపలున్న వారిని బయటకు తెచ్చి కాపాడారు. ఈ ప్రమాదంలో అందరి ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.