మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీరాభిమాని అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న తమ అధినేతపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్దా వెంకన్న అభిషేకం చేశారు. అంతే కాకుండా రక్తంతో గోడపై ‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’ అంటూ రాశారు. కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబుతోనే తన ప్రయాణం అని ఆయన స్పష్టం చేశారు.