Sunday, October 27, 2024

హరర్ థ్రిల్లర్స్ కి బాబు లాంటి సినిమా అది .. ప్రతీ సీను క్లైమాక్స్!

ఓటీటీ వేదికలపై ప్రతీవారం ఎన్నో వెబ్ సిరీస్ లు, సినిమాలు రిలీజవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫ్యామిలి డ్రామా అయితే మరికొన్ని క్రైమ్, హరర్, థ్రిల్లర్ జానర్ చిత్రాలు. వాటిల్లో ఏది బెస్ట్.. ఏది ఎక్కువగా హరర్ మూవీ. ‌ ఏదీ థ్రిల్లర్ అవుతుందో ఓసారి చూస్తే తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో బెస్ట్ హరర్ మూవీగా అత్యధిక వీక్షకాధరణ పొందిన ఓ తెలుగు సినిమా గురించి తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ‘ హాఫ్ స్టోరీస్’ అనే సినిమా రిలీజైంది. ఇది థియేటర్లలో రిలీజైన పెద్దగా ఆడలేకపోయింది కారణం ఇందులో నటించిన వాళ్ళంతా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులే.. రంగస్థలం మహేశ్, సంపూర్ణేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ కోఠి, రాజీవ్ , TNR, కంచెరపాలెం రాజు, జెమినీ సురేష్ తదితరులు నటించారు.  ఈ సినిమా కథేంటంటే..  మొదటగా ఫేక్ బాబా అని నిరూపించడానికి ఒక పాతపడ్డ గుహాలోకి ఇద్దరు మీడియా వాళ్ళు సీక్రెట్ కెమెరా పట్టుకొని వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళాక.. కొన్ని నెలల క్రితం చనిపోయి‌న వాళ్ళ హెడ్ అండ్ చేర్ పర్సన్ అయిన వ్యక్తి వారి కళ్ళ ముందుకు వస్తాడు. దాంతో ఆత్మలున్నాయంటూ వాళ్ళు పరుగున వస్తారు. నమ్మినా నమ్మకపోయిన దెయ్యాలున్నాయంటూ  కథ మొదలవుతుంది. 

ఆ తర్వాత ఒక రైటర్ తను ఓ బుక్ చదువుతున్నట్టుగా, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందటూ మహేశ్ తో చెప్తుండగా అతడికి లక్ష్మీ కాల్ చేస్తుంది. ఇక వాళ్ళ మామయ్య వాళ్ళు ఇంట్లో లేరని వాళ్ళింటికి ఓ బిర్యానీ పాకెట్, రెండు బీర్లతో వెళ్తారు. ఇక ఆ బిర్యానీని లక్ష్మీకి ఇచ్చి మహేశ్, అతడి ఫ్రెంట్ రైటర్ కలిసి మేడ మీదకి వెళ్తారు. ఇక వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్నాక లక్ష్మి కూడా మేడమీదకి వచ్చి మాట్లాడుతుంది. అతను రైటర్ కదా .. మంచి కథ చెప్పండి అనగానే.. ఓ కథ మొదలవుతుంది. ఆ కథేంటి ? వాళ్ళు ముగ్గురి లైఫ్ లు ఎలా టర్న్ తిరిగాయి అనేది మిగతా కథ. అయితే ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ లకి బుర్ర పాడవుతుంది.  ప్రతీ పది నిమిషాలకో ట్విస్ట్ తో ఊహకందనివి జరుగుతుంటాయి. అయితే కథ చివరలో ఏం జరిగిందోననే క్యూరియాసిటిని రేకెత్తిస్తూ మరో పార్ట్ రాబోతుందనే ఎండ్ కార్డ్ వేసేశారు మేకర్స్. ఇలాంటి హారర్ సినిమాని చూడాలంటే కాస్త గడ్స్ కూడా ఉండాలి. అయితే మీలో ఎంతమంది ఈ సినిమాని చూసారు.  చూసినవారికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రస్తుతం హారర్ థ్రిల్లర్స్ మూవీల లిస్ట్ లో ఇది తెలుగులో టాప్ లో ఉంది. 

 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana