Wednesday, October 30, 2024

వరుణ్ తేజ్ కి మద్దతుగా సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ 

కెరీర్ మొదటి నుంచి హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలు చేసుకుంటే వెళ్లే నటుల్లో వరుణ్ తేజ్ కూడా ఒకడు. హీరో కటౌట్ కి కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్  ఉన్నా కూడా ఎందుకనో  సాలిడ్ హిట్ పడటం లేదు. గత రెండు చిత్రాలైన  గని, గాండీవదారి అర్జున లు  అయితే  మరి దారుణమైన పరాజయాన్ని చవి చూశాయి. అసలు ఆ సినిమాలు ఎప్పుడొచ్చాయో కూడా ఎవరకి తెలియని పరిస్థితి. ఇలాంటి టైం లో వరుణ్ కి సంబంధించిన తాజా న్యూస్ ఇప్పుడు క్రేజీ న్యూస్ గా మారింది.

వరుణ్ నయా మూవీ  ఆపరేషన్ వాలెంటైన్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన  ఈ  ద్విభాషా చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ రేపు విడుదల కానుంది. తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేస్తుండగా  హిందీ ట్రైలర్ ని  సల్మాన్ ఖాన్ లాంచ్ చేస్తున్నాడు. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.ఇప్పుడు ఈ వార్త ఫిలిం సర్కిల్స్ తో  పాటు సోషల్ మీడియాలో కూడా క్రేజీ గా మారింది. ఆల్రెడీ ఇప్పటికే  రిలీజైన టీజర్, పాటలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి.

నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ లో  వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్  ఆఫీసర్ (IAS ) క్యారక్టర్ ని పోషించాడు. ఆ  పాత్ర కోసం ప్రత్యేకంగా  శిక్షణ కూడా తీసుకున్నాడు. 2017 మిస్ వరల్డ్  మానుషి చిల్లర్ వరుణ్ తో జతకట్టింది.ఆమె కూడా ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించనుంది. నవదీప్, రుహాని శర్మ లు  కీలక పాత్రల్లో నటించారు. సోనీ పిక్చర్స్  పై సందీప్ ముద్దా, నందకుమార్ అబ్బినేని లు  నిర్మించగా  శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. మార్చి 1న  తెలుగు, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.


 

 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana