Friday, February 7, 2025

తెలుగులో జాన్వీ కపూర్‌ రెండో సినిమా కన్‌ఫర్మ్‌ అయింది!

రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యమైంది. దీన్ని కంప్లీట్‌ చేసి నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌కి వెళ్లిపోవాలని ప్లాన్‌ చేస్తున్నాడు. ‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందే ‘ఆర్‌సి16’ని సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్‌లో భాగంగా ఇప్పటికే స్కోరీ డిస్కషన్స్‌, మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ పూర్తయ్యాయి. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌కి వెళుతుంది. గత కొంతకాలంగా ఈ సినిమాలో ఎవరు హీరోయిన్‌గా నటిస్తారనే విషయంలో సోషల్‌ మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి. చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడా ఊహాగానాలకు తెరపడిరది. 

ఆర్‌సి 16లో అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. రామ్‌చరణ్‌ సరసన జాన్వీ నటించనుందనే విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్‌ కన్‌ఫర్మ్‌ చేశారు. రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ కలిసి నటిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది నిజమేనని బోనీకపూర్‌ ప్రకటనతో రుజువైంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడిరచారు. ‘రామ్‌చరణ్‌తో జాన్వీ నటించనున్న త్వరలోనే ప్రారంభం అవుతుంది’ అని తెలిపారు. జాన్వీకి ఇది తెలుగులో రెండో సినిమా అవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana