తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).ఈయన చాలామంది డైరెక్టర్లతో సినిమాలు చేయడమే కాకుండా సక్సెస్ లను కూడా అందుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే పవన్ కళ్యాణ్ తో చాలా మంది దర్శకులు సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపించారు.కానీ ఆయన ఉన్న బిజీ వల్ల కొంతమంది డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేయగలిగాడు.
అందులో ఆయనతో సినిమా చేయాలనుకున్న చాలా మంది దర్శకులు ఆయన డేట్స్ దొరకక వేరే హీరోలతో సినిమాలు చేసి వాళ్లకు బ్లాక్ బాస్టర్ హిట్లను( Blockbuster Hits ) కూడా అందించారు.
ఇక అందులో ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా( Dookudu Movie ) స్టోరీ ని కూడా ముందుగా పవన్ కళ్యాణ్ తో తీయాలని అనుకున్నాడట.కానీ అప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో శ్రీను వైట్ల మహేష్ బాబు( Mahesh Babu )తో ఈ సినిమాను చేయాల్సి వచ్చిందని తెలియజేశాడు.ఇక దాంతో మహేష్ బాబు కెరీయర్ లో దూకుడు సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా ప్లాపుల్లో ఉన్న మహేష్ బాబును సక్సెస్ ఫుల్ హీరోగా కూడా మార్చింది.
ఇక ఇది ఇలా ఉంటే శ్రీను వైట్ల( Srinu Vaitla ) మాత్రం తన ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా ప్రయత్నం చేశాడు.కానీ ఇప్పటివరకు కూడా ఆ ప్రయత్నం అనేది సఫలం కాలేదు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండింటిని మ్యానేజ్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు… ప్రస్తుతం ఎలక్షన్స్( Elections ) బిజీ లో ఉన్న పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లకి దూరం గా ఉంటున్నాడు…
.