నాలుగేళ్లుగా..
స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 సెప్టెంబర్‌లో హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది. అయితే, ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ నిలిచింది. అనంతరం వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ ఇతర చిత్రాలకు డేట్లు కేటాయించడం, రాజకీయంగా బిజీ కావడంతో హరిహర వీరమల్లు నిలిచిపోయింది. ఆశించిన స్థాయిలో షూటింగ్ జరగలేదు.