భారీ లక్ష్యఛేదనకు నేడు రెండో సెషన్లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. అయితే, భారత్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ చాకచక్యంతో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (4) ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. జాక్ క్రాలీ (11)ను బుమ్రా ఔట్ చేశాడు. ఓలీ పోప్ (3), జానీ బెయిర్ స్టో (4), జో రూట్ (7)లను వెంటవెంటనే ఔట్ చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు భారత స్పిన్నర్ జడేజా. కాసేపు నిలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ (15)ను కుల్దీప్ ఔట్ చేయగా.. ఫోక్స్ (16)ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. చివర్లో మార్క్ వుడ్ (33) కాసేపు మెరిపించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైన చేసింది. వ్యక్తిగత కారణాలతో మూడో రోజుకు దూరమై.. జట్టులోకి మళ్లీ తిరిగి వచ్చిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్ టామ్ హార్ట్లీ (16) ఔట్ చేశాడు. మార్క్ వుడ్‌ను చివరి వికెట్‌గా పంపాడు జడేజా. దీంతో భారత్ భారీ విక్టరీ సాధించింది.