“గామి టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నాను” అని ప్రభాస్ తన రియాక్షన్ తెలిపాడు. ఇదిలా ఉంటే గామి సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రానుంది. నిజానికి విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మార్చి 8న రిలీజ్ కావాల్సింది. కానీ, ఆ స్థానంలో గామి విడుదల కానుంది. గామిలో విశ్వక్‌కు జోడీగా చాందినీ చౌదరి నటించింది. వీళ్లిద్దరితోపాటు సినిమాలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.