థైరాయిడ్-ఫెర్టిలిటీ కనెక్షన్
గుర్గావ్ లోని ఆరా స్పెషాలిటీ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ రీతూ సేథీ హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థైరాయిడ్ సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. థైరాక్సిన్ (టి 4), ట్రైయోడోథైరోనిన్ (టి 3).. అనే హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీరంలోని జీవక్రియలను, శక్తి ఉత్పత్తిని నియంత్రిస్తాయి. థైరాయిడ్ అతి చురుకుగా పనిచేస్తున్నా, లేక మందకొడిగా పనిచేస్తున్నా కూడా సమస్యే. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.