Saturn transit: గ్రహాల సంచారంలో శని కదలికలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. శని స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తికి డబ్బుకు లోటే ఉండదు. ఏ పని తలపెట్టినా అందులో విజయం వారిదే అవుతుంది. మంచి పనులు చేస్తే అందుకు అనుగుణంగా శని చల్లని చూపు ఉంటుంది. అదే చెడ్డ పనులు చేస్తే కర్మల అనుసారం ఫలితం ఇస్తాడు. అందుకే శనీశ్వరుడిని కర్మల ఫల దాత, న్యాయ దేవుడని పిలుస్తారు.