న్యూమరాలజీ ప్రకారం ఓ వ్యక్తి పుట్టిన తేదీని కూడిన తర్వాత వచ్చే అంకెని రాడిక్స్ అంటారు. అలాగే మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కూడినప్పుడు వచ్చే సంఖ్యని ఫేట్ నెంబర్ అని పిలుస్తారు. 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులకు వారి రాడిక్స్ నెంబర్ 8. అంటే 1+7=8, 2+6=8. న్యూమరాలజీ ప్రకారం సంఖ్య అధిపతిగా శని దేవుడిని భావిస్తారు. రాడిక్స్ 8 ఉన్న వారి పట్ల శని దేవుడు దయ చూపిస్తాడని చెప్తారు. రాడిక్స్ నెంబర్ 8 లేదా 8, 17, 26 తేదీల్లో పుట్టిన రాశుల వారు కష్టపడిన దానికి ప్రతిఫలం అందుకుంటారు. విజయం వరిస్తుంది. శని దేవుడి ఆశీస్సులు ఉంటాయి. జీవితంలో ఏ సమయంలోనైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరికి విజయం మాత్రం వీరినే వరిస్తుంది.