- హోం పేజీలో కనిపిస్తున్న కెరీర్స్ లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అక్కడ కనిపిస్తున్న క్లర్క్ రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఆ పేజీలో అందుబాటులో ఉన్న ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- అవసరమైన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- మీ ఫలితం స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
- రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
మెయిన్స్ పరీక్ష తేదీలు
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ప్రకారం, మెయిన్ పరీక్ష 2024 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 మధ్య జరుగుతుంది. మెయిన్ పరీక్షలో జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటల 40 నిమిషాలు, గరిష్ట మార్కులు 200. మెయిన్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/4వ వంతు కోత విధిస్తారు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 8283 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.