మరో మూడు రోజులు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో అశ్విన్ దూరం కావడంతో మూడో టెస్ట్‌లో రిజల్ట్‌పై ఆసక్తి ఏర్పడింది. కుల్దీప్, జడేజా కలిసి ఇంగ్లండ్ జోరుకు ఏ మాత్రం అడ్డుకట్ట వేస్తారన్నది చూడాల్సిందే. రాజ్ కోట్ తర్వాత జరుగనున్న మిగిలిన టెస్ట్‌లకు అశ్విన్ అందుబాటులో ఉండటం కూడా అనుమానమేనని తెలుస్తోంది. ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లి ఈ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. గాయాలతో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మధ్యలోనే సిరీస్ నుంచి వైదొలిగారు. తాజాగా అశ్విన్ కూడా దూరమవ్వడంతో ఇండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.