స్టైలిష్ అండ్ ఫంక్షనల్: హానర్ ఛాయిస్ వాచ్
హానర్ ఛాయిస్ వాచ్ (Honor Choice Watch) అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో స్టైలిష్ లుక్ తో మార్కెట్లోకి వచ్చింది. ముఖ్యంగా యూత్ ను ఆకర్షించే ఫీచర్స్ ను దీనిలో పొందుపర్చారు. ఇది 1.95 అంగుళాల అల్ట్రా-థిన్ అమోలెడ్ డిస్ ప్లే, బిల్ట్-ఇన్ జీపీఎస్, వన్-క్లిక్ ఎస్ఓఎస్ కాలింగ్ వంటి ప్రత్యేకతలు కలిగి ఉంది. హానర్ హెల్త్ యాప్ తో అనుసంధానించబడిన ఈ వాచ్ రోజంతా SpO2, స్ట్రెస్ మానిటరింగ్ తో సహా అధునాతన ఆరోగ్య మానిటరింగ్ ఫీచర్లను అందిస్తుంది. ఆకట్టుకునే 5 ఎటిఎం వాటర్ రెసిస్టెన్స్ స్థాయితో, రోజువారీ కార్యకలాపాలు, ఫిట్ నెస్ యాక్టివిటీస్ కు ఇది సరైనదని హానర్ పేర్కొంది.