Home ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు పోలీసులు బ్రేక్, అనుమతులు లేవని అరెస్టులు!-amaravati news in telugu...

సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు పోలీసులు బ్రేక్, అనుమతులు లేవని అరెస్టులు!-amaravati news in telugu ap cps employees protest chalo vijayawada police denied permissions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

విజయవాడ ధర్నా చౌక్ లో

ఏపీ సీపీఎస్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని, సీపీఎస్ (CPS Employees Protest)రద్దు చేయాలని చలో విజయవాడ(Chalo Vijayawada) ఆందోళనకు పిలుపునిచ్చారు. విజయవాడ ధర్నాచౌక్ లో చలో విజయవాడ నిరసన కార్యక్రమం నిర్వహణకు అనుమతించాలని పోలీసులను కోరారు. కానీ అనుమతులు నిరాకరించారు. పలువురు సీపీఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సీపీఎస్(CPS) రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ ను అంగీకరించమని తేల్చిచెబుతున్నారు. ఎవరైతే జీపీఎస్(GPS) కు అంగీకరించాలని ఆ నలుగురు ఉద్యోగ సంఘాల నేతలకు అమలు చేసుకోవచ్చని సీపీఎస్ ఉద్యోగులు అంటున్నారు. జీపీఎస్ వల్ల ఉద్యోగుల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా మారుతున్నాయని, అత్యవసర సమయాల్లో డబ్బులు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా మారిపోయాయన్నారు. చలో విజయవాడకు పోలీసులు అనుమతులు ఇవ్వడపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు.

Exit mobile version