Vishwak Sen: మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్ దూకుడు మీద ఉన్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక చిత్రం ‘గామి’ రిలీజ్‍కు సిద్ధమైంది. అఘోరాగా విశ్వక్ నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కూడా ఆయన చేస్తున్నారు. అలాగే, రామ్ తాల్లూరి దర్శకత్వం మరో చిత్రం కూడా విశ్వక్ లైనప్‍లో ఉంది. ఇలా ఫుల్ బిజీగా ఉంటున్నారు. కాగా, తాను తనకు ఇష్టమైన హీరో చేస్తున్న ఓ పెద్ద సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్‍సేన్ చెప్పారు. దీంతో ఈ మూవీ ఏదనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.