మరోవైపు, దేవర పార్ట్-1 చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామని మూవీ ప్రకటించింది. అయితే, పుష్ప 2: ది రూల్ చిత్రం ఆగస్టు 15వ తేదీ నుంచి వాయిదా పడితే.. అప్పుడు దేవర రావొచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అలా జరిగితే.. దేవర, తండేల్ పోటీ తప్పే ఛాన్స్ ఉంటుంది. రిలీజ్ డేట్లు అనూహ్యంగా మారిపోతున్న ట్రెండ్‍లో చివరికి ఏం జరుగుతుందో చూడాలి.